Mallu Ravi: ‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:13 PM
Mallu Ravi: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్మ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత సీసాలో కొత్త వైన్ పోసినట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీ, జనవరి 31: రాష్ట్రపతి ప్రసంగం అత్యంత నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఆమె ప్రసంగం కొత్త సీసాలో పాత వైన్ పోసినట్లుగా ఉందని తెలిపారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న కార్యక్రమాలు అందులో పొందుపరిచినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంపై శుక్రవారం న్యూఢిల్లీలో ఎంపీ మల్లు రవి విలేకర్లతో మాట్లాడుతూ.. దేశం యధార్థ స్థితిలో కొనసాగి పరిస్థితి కనిపిస్తుందని చెప్పారు. దేశంలో ప్రజలు రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఒకటి నిత్యావసర వస్తువుల ధరలు అయితే మరొకటి నిరుద్యోగమని ఆయన స్పష్టం చేశారు.
నిరుద్యోగులంతా బ్యాంకుల్లో రుణం తీసుకోని.. మీ ఉద్యోగాలు మీరే చేసుకోండని చెప్పే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రసంగం ఉందన్నారు. దేశంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే దేశంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఉప్పు, పప్పుల ధరలు తగ్గిస్తామని.. ఆ దిశగా చర్యలు చేపడతామని కానీ తన ప్రసంగంలో రాష్ట్రపతి ఎక్కడా చెప్పలేదని చెప్పారు.
అదే విధంగా రైతులను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని కూడా ఎక్కడ స్పష్టం చేయలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరకు చట్టం కల్పిస్తామని చెప్పారని... కనీసం అది కూడా నేరవేర్చలేదని ఈ ప్రసంగం అంటూ మండిపడ్డారు.
Also Read : దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కానీ వక్ఫ్ బోర్డుతోపాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు మాత్రం యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చారన్నారు. జేపీసీలో అధికార పార్టీ సభ్యులు అధికంగా ఉన్నారని.. దీంతో ఈ బిల్లులను ప్రస్తుతం ఆమోదం చేయనున్నారని తెలిపారు. దీనిని పాస్ చేయాలని చూస్తున్నారంటూ బీజేపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క అంశం రాష్ట్రపతి ప్రసంగంలో లేదని కుండ బద్దలు కొట్టారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి.. మళ్లీ వెనక్కి తీసుకున్నారంటూ మోదీ ప్రభుత్వంపై ఎంపీ మల్లు రవి నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు.
Also Read : రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన సోనియా.. బీజేపీ మండిపాటు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. అయితే శుక్రవారం అంటే.. జనవరి 31వ తేదీన ఈ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇవి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగుతాయి. రెండో విడత సమావేశాలు మాత్రం.. మార్చి10వ తేదీ నుంచి ఏప్రిల్ 04వ తేదీ వరకు జరుగుతాయి. ఆ క్రమంలో ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో.. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు తమదైన శైలిలో స్పందించారు. ఈ వ్యవహారంపై బీజేపీ మండిపడింది. అంతేకాదు.. ఆమెకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది. మరోవైపు సోనియా, రాహుల్ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ సైతం స్పందించింది. సోనియా వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తప్పు పట్టింది. ఆమె ఆ విధంగా స్పందించకుండా ఉండాల్సిందంటూ అభిప్రాయపడింది.
For Telangana News And Telugu News