Share News

MP Kavya: ఆ పనులు వేగంగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Apr 24 , 2025 | 08:07 AM

వరంగల్‌, కాజీపేట రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. అలాగే.. జోన్‌ పరిధిలో కీలకమైన కాజీపేట జంక్షన్‌ ప్రాముఖ్యతను తగ్గకుండా చూడాలని కోరారు.

MP Kavya: ఆ పనులు వేగంగా పూర్తిచేయాలి

- వరంగల్‌ ఎంపీ కావ్య

- దక్షిణమధ్య రైల్వే జీఎంకు వినతి

హైదరాబాద్‌ సిటీ: అమృత్‌ భారత్‌ పథకం కింద వరంగల్‌, కాజీపేట(Warangal, Kazipet) రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ కడియం కావ్య(MP Kadiyam Kavya) అన్నారు. తమ నియోజకవర్గాల్లో.. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌తో కలిసి ఆమె, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: 4 నుంచి ‘జేఎన్‌టీయూ’కు సెలవులు


ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ.. తన పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. జోన్‌ పరిధిలో కీలకమైన కాజీపేట జంక్షన్‌ ప్రాముఖ్యతను తగ్గకుండా చూడాలని కోరారు. కాజీపేట లోకో రన్నింగ్‌ డిపో సిబ్బందిని విజయవాడ డిపోకు బదిలీ చేశారన్నారు.


city3.jpg

ప్రస్తుతం ఈ స్టేషన్‌లో కొత్త పోస్టుల భర్తీపై అధికారులు శ్రద్ధ కనబరచడం లేదని తెలిపారు. కాజీపేటలో ఉండాల్సిన 709 మంది ఉద్యోగులకు గాను 526 మందే విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇంకా పలు అంశాలపై అరుణ్‌తో మాట్లాడారు. ఆయన కూడా వాటన్నింటిపై సానుకూలంగా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 08:07 AM