Dharmapuri Arvind: రాష్ట్రంలో అసమర్థ పాలన
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:53 AM
రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.

సీఎంను మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ యోచన
ప్రధాన ప్రతిపక్షం ఫాంహౌజ్‌లో పడుకుంది:అర్వింద్
హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయలేని కాంగ్రెస్, ప్రజల దృష్టి మళ్లించడానికి కులగణన, పుష్ప, హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఇప్పుడు హెచ్‌సీయూ భూముల వివాదం సృష్టించిందన్నారు. రోజురోజుకు సీఎం రేవంత్ గ్రాఫ్ పడిపోతోందన్నారు.
సీఎం రేవంత్‌ను మార్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందని, అయితే ఆయన్ను మారిస్తే మరొకరు లేరని అర్వింద్ తెలిపారు. ఒక్క మంత్రి శ్రీధర్‌బాబు తప్ప మిగతావారంతా అన్‌ఫిట్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఫాంహౌజ్‌లో పడుకుందంటూ కేసీఆర్‌ను ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనేత హోదా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.