MLC Kavitha: అనుమతి ఇవ్వకుంటే హైకోర్టును ఆశ్రయిస్తా
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:14 AM
తాను చేపట్టదలచిన 72గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.

72 గంటల నిరాహార దీక్షపై ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): తాను చేపట్టదలచిన 72గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఈనెల 4 నుంచి 7 వరకు తాను చేపట్టదలచిన 72గంటల నిరాహార దీక్షకు పోలీసులు అనుమతించలేదని పేర్కొన్నారు. దీక్షకు అనుమతి కోరుతూ సెంట్రల్ జోన్ పోలీసులకు తెలంగాణ జాగృతి నాయకులు ఇదివరకే దరఖాస్తు చేశారని, అయితే పోలీసులు సాకులు చెబుతున్నారని కవిత ఆరోపించారు.