MLA Rajasingh: రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయం: రాజాసింగ్
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:14 AM
హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
హైదరాబాద్ సిటీ: హిందు దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి(Rajamouli) వ్యాఖ్యలు ఆక్షేపణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh) పేర్కొన్నారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే అదే మాట చెప్పాలన్నారు. రాజాసింగ్ గురువారం ఓ వీడియో విడుదల చేశారు. ‘మా అమ్మనాన్నలు హనుమంతుడి భక్తులని, కానీ నాకు విశ్వాసం లేదు’ అని రాజమౌళి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. గతంలో కూడా శ్రీకృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

అలాగే శ్రీరామచంద్రుడిపై కూడా కామెంట్ చేశారన్నారు. దేవుళ్లపై అనవసరంగా మాట్లాడే దర్శక, నిర్మాతలు, నటుల సినిమాలను బహిష్కరించాలని అన్నారు. అదేవిధంగా హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పాలని విశ్వహిందు పరిషత్ నాయకుడు తనికెళ్ల సత్యకుమార్ పేర్కొన్నారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆపేస్తామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
Read Latest Telangana News and National News