Share News

Smitha Sabharwal: అదిరేలా అందాల పోటీలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:30 AM

తెలంగాణ టూరిజం బ్రాండ్‌ పెరిగేలా, తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చే విధంగా మిస్‌ వరల్డ్‌ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Smitha Sabharwal: అదిరేలా అందాల పోటీలు

  • హైదరాబాద్‌కు తరలిరానున్న 120 దేశాల మోడల్స్‌

  • చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌, చౌమహల్లా ప్యాలెస్‌ లో వెల్కమ్‌ డిన్నర్‌

  • ఏర్పాట్లపై స్మిత సబర్వాల్‌ సమీక్ష

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ టూరిజం బ్రాండ్‌ పెరిగేలా, తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చే విధంగా మిస్‌ వరల్డ్‌ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 7 నుంచి 31 వరకు తెలంగాణ పర్యాటక శాఖ నేతృత్వంలో జరగబోయే మిస్‌ వరల్డ్‌ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోటీల్లో పాల్గొనే 120 దేశాలకు చెందిన మోడల్స్‌ వచ్చే నెల ఆరు, ఏడో తేదీల్లో హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌, చౌమహల్లా ప్యాలె్‌సలో వెల్కమ్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లపై టూరిజం, జీహెచ్‌ఎంసీ, హెరిటేజ్‌, పోలీస్‌ అధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రణాళిక రూపొందిస్తోంది.


ఈ మోడల్స్‌ తో పాటు పలు దేశాలకు చెందిన సుమారు 400 మంది ఫోటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు కూడా రానుండడంతో ఆరంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను స్మిత సబర్వాల్‌ ఆదేశించారు. లైవ్‌, సూఫీ మ్యూజిక్‌, ఖవ్వాలీ సంగీత ప్రదర్శనతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్ని రూపొందించాలని చెప్పారు. అనంతరం జరిగే వెల్‌కం డిన్నర్‌లో నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెనూలో ఉండాలని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 09 , 2025 | 04:30 AM