Sridhar Babu: సీఎం రేవంత్‌ను సమర్థిస్తూనే బీఆర్ఎస్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
ABN , Publish Date - May 06 , 2025 | 06:36 PM
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు, అందాల పోటీలపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని, అందువల్ల ఆయనపై అనవసరమైన ఆరోపణలు చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక తప్పిదాలను సరిచేస్తున్నామని సీఎం చెప్పడం, రాష్ట్రానికి అవసరమైన మార్పులు తీసుకురావడంలో ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీపై విమర్శలు
బీజేపీ ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు చేస్తూ, ఈ పార్టీకి పాలించే అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఏ వ్యవస్థను కూడా హ్యాండిల్ చేయని బీజేపీకి పాలించే అర్హత ఎక్కడిదన్నారు. ఈ వ్యాఖ్యలు, బీజేపీ ప్రభుత్వంపై ప్రజలలో కొత్త అభిప్రాయాన్ని రేకెత్తిస్తున్నాయి. మంత్రులు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి వెళ్లాలంటే, కార్ కంటే హెలికాప్టర్ వాడడం ఖర్చు తక్కువ అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హెలికాప్టర్ కొనుగోలు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రభుత్వానికి అవసరమైన సమయంలో హెలికాప్టర్ వాడడం, ఖాళీగా ఉండడం కంటే మంచిదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అడ్డగోలు ఖర్చులు చేసినట్లు ఆరోపించారు.
ఉద్యోగుల సమస్యలు
పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాల్సి వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచారని గుర్తు చేశారు మంత్రి. మాకు ప్రభుత్వాన్ని నడిపే సత్తా ఉందో లేదో ప్రజలకి తెలుసని ఆయన అన్నారు. ఇది, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలను, ఉద్యోగుల సంక్షేమాన్ని గుర్తు చేస్తుందన్నారు. అందాల పోటీల గురించి మాట్లాడుతూ ఇవి అందానికి సంబంధించినవి కాదన్నారు. వ్యక్తిత్వానికి సంబంధించినవని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరుతెచ్చే అందాల పోటీలను గౌరవంగా భావించడం, రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతను ప్రదర్శించడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కవితపై వ్యాఖ్యలు
కవిత మాట్లాడిన అంశాలపై కూడా మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, ఆమె బీఆర్ఎస్ స్ట్రాటజీ ప్రకారమే మాట్లాడుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలెప్పుడూ మాకు ప్రత్యర్థులేనని, కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయడం లేదంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. దీంతోపాటు స్మితా సబర్వాల్ పై మాకు ఎలాంటి కక్ష్య లేదన్నారు. మాకు అయినా, అధికారులకు అయినా కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు. అందాల పోటీల ఖర్చుకు, ఉద్యోగస్థుల సమస్యకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ గురించి అనేక మందికి తెలియజేయాలనేదే సీఎం ఉద్దేశమని, ఈ క్రమంలో అందా పోటీల గురించి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఇవి కూడా చదవండి:
Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News