Jagga Reddy Election Decision: వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Oct 03 , 2025 | 08:00 AM
వచ్చే ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎందుకంటే..
సంగారెడ్డి: అంబేద్కర్ స్టేడియంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రావణ దహనాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జగ్గారెడ్డి దంపతులు, టిపిసిసి సీనియర్ నేత జెట్టి కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన భార్య నిర్మల సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు.
అదేవిధంగా యువతకు పిలుపునిస్తూ, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటికి బానిసలయి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అంతేకాదు అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read:
నాటు కోడితో ఇన్ని లాభాలా.. అందుకే ఇంత డిమాండ్..!
పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..
For More Latest News