Indiramma Housing Scam: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో మోసం
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:14 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో లబ్ధిదారులను మోసం చేసి డబ్బులు దండుకున్న ఓ మేస్త్రీ పరారైన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి తండాలో వెలుగులోకి వచ్చింది.

లక్షల్లో వసూలు చేసి ఉడాయించిన మేస్త్రీ
చిన్నశంకరంపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో లబ్ధిదారులను మోసం చేసి డబ్బులు దండుకున్న ఓ మేస్త్రీ పరారైన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి తండాలో వెలుగులోకి వచ్చింది. మిర్జాపల్లి తండాలో మొత్తం 22 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడతగా బేస్‌మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత ఒక్కో లబ్ధిదారుడి ఖాతాలో రూ.లక్ష చొప్పున జమ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇళ్లు కట్టిస్తానని నమ్మబలికిన ఝార్ఖండ్‌కు చెందిన అబ్దుల్ యూనస్ అనే మేస్త్రీ లబ్ధిదారులతో ఒప్పందం చేసుకున్నాడు.
కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకున్న యూనస్.. పనులు ప్రారంభించిన తర్వాత మరింత డబ్బు వసూలు చేశాడు. ఒక్కో లబ్ధిదారుడు లక్షకుపైనే అతడికి చెల్లించారు. ఈనెల 26 నుంచి మేస్త్రీ కనిపించకుండా పోవడంతో, లబ్ధిదారులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళన చెందిన బాధితులు, మండల కేంద్రంలో అతడు అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా..ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని తెలిపారు. దీంతో మోసపోయామని గ్రహించిన లబ్ధిదారులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News