Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు ఆపండి: మందకృష్ణ
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:12 AM
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు అన్ని ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి.. మంద కృష్ణమాదిగ శనివారం లేఖ రాశారు.

హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు అన్ని ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి.. మంద కృష్ణమాదిగ శనివారం లేఖ రాశారు. దేశంలో అందరికంటే ముందుగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని, అదే సమయంలో గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ ప్రకారం నియామకాలు చేపడతామని అసెంబ్లీలో సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెబుతూ.. మరోవైపు గ్రూప్-1,2, 3 పరీక్షల ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.