Share News

Mallu Ravi: కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవి

ABN , Publish Date - May 30 , 2025 | 04:22 AM

కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవిని అధిష్ఠానం నియమించింది. ఎట్టకేలకు.. 70 మందితో కూడిన పలు కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది.

Mallu Ravi: కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవిని అధిష్ఠానం నియమించింది. ఎట్టకేలకు.. 70 మందితో కూడిన పలు కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) ఆ వివరాలను వెల్లడించారు. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని.. 15 మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్‌ కమిటీ, 16 మందితో ‘సంవిధాన్‌ బచావో ప్రోగ్రాం’ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణ కమిటీని నియమించారు. ఈ కమిటీలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేసీ వేణుగోపాల్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పోస్టుల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరక పెండింగ్‌లో ఉంచారు. సీఎం, పీసీసీ చీఫ్‌లు ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా.. వెళ్లడం లేదని సమాచారం.


రాజకీయ వ్యవహారాల కమిటీలో ఎవరంటే?

మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌ గౌడ్‌, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనరసింహ, వంశీచంద్‌ రెడ్డి, జి.రేణుకా చౌదరి, పోరిక బలరాం నాయక్‌, డి.శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, షబ్బీర్‌ అలీ, మహ్మద్‌ అజారుద్దీన్‌, ఆది శ్రీనివాస్‌, శ్రీహరి, బీర్ల అయిలయ్య, పి.సుదర్శన్‌ రెడ్డి, కె.ప్రేమ్‌సాగర్‌ రావు, కుసుమ్‌కుమార్‌, అనిల్‌ కుమార్‌ కమిటీలో ఉన్నారు. ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల ప్రధాన బాధ్యులు ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులు వ్యవహరించనున్నారు.


సలహా కమిటీ..: మీనాక్షి నటరాజన్‌, రేవంత్‌రెడ్డి, మహేశ్‌ గౌడ్‌, వి.హనుమంతరావు, కె.జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్‌, జి.చిన్నారెడ్డి, గీతారెడ్డి, ఎం. అంజన్‌కుమార్‌యాదవ్‌, జగ్గారెడ్డి, జాఫర్‌ జావేద్‌, టి.జీవన్‌రెడ్డి, రాజయ్య, రాములు నాయక్‌ డీలిమిటేషన్‌ కమిటీ..: చల్లా వంశీ చంద్‌ రెడ్డి, గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, పవన్‌ మల్లాది, వెంకటరమణ సంవిధాన్‌ బచావో ప్రోగ్రాం కమిటీ..: పి.వినయ్‌ కుమార్‌, అద్దంకి దయాకర్‌, కె.శంకరయ్య, ఎన్‌.బాలు నాయక్‌, నర్సారెడ్డి, ఆత్రం సుగుణ, రాచమల్ల సిద్ధేశ్వర్‌, సంతోష్‌ కోల్కొండ, అనిల్‌కుమార్‌, జూలూరి ధనలక్ష్మి, మజీద్‌ఖాన్‌, జి.రాములు, అర్జున్‌రావు, సౌరి, వల్లభరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిక్రమశిక్షణ కమిటీ..: ఎంపీ మల్లు రవి (చైర్మన్‌), ఎ.శ్యామ్‌మోహన్‌ (వైస్‌ చైర్మన్‌), సభ్యులుగా ఎం. నిరంజన్‌ రెడ్డి, బి. కమలాకర్‌రావు, జాఫర్‌ జాయెద్‌, జి.వి.రామకృష్ణ ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 04:22 AM