Mallu Ravi: ఆ భూములు హెచ్‌సీయూవి కావు
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:01 AM
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివని.. హెచ్‌సీయూవి కాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు తెలంగాణ సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయన్నారు.

కేంద్ర సాధికార కమిటీ చైర్మన్‌కు మల్లు రవి లేఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివని.. హెచ్‌సీయూవి కాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు తెలంగాణ సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయన్నారు. ఆ భూములపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ చైర్మన్ చంద్రప్రకాశ్ గోయల్‌ను శనివారం ఢిల్లీలో ఆయన కలిశారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఐదు పేజీల లేఖను అందజేశారు. ‘కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న భూములు రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తిగా ప్రభుత్వానివి. ఆ భూములు కంచ పోరంబోకుగా రికార్డుల్లో ఉన్నవి.
ఈ భూమిని అటవీ భూమిగా ఎన్నడూ నోటిఫై చేయలేదు. 1975లో సర్వే నంబరు 25, ఇతర సర్వే నంబర్లలోని మొత్తం భూమిని హెచ్‌సీయూకు కేటాయించినా, యాజమాన్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించలేదు’ అని లేఖలో వివరించారు. అలాగే అప్పట్నుంచి ఇప్పటివరకు ఆ భూములపై జరిగిన కోర్టు కేసులు, ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు అన్నింటిని లేఖలో ప్రస్తావించారు. ప్రజాప్రయోజనాలను పరిరక్షించడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి 400 ఎకరాల భూమి వాస్తవ స్థితిని సుప్రీంకోర్టు ముందుంచాలని కమిటీ చైర్మన్ చంద్రప్రకాశ్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే భూముల వ్యవహారంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి లేఖలను సమర్పించారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News