Share News

Mallu Bhatti Vikramarka: సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే బనకచర్ల ఆగింది: భట్టి

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:28 AM

సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన తరువాత బనకచర్ల ప్రాజెక్ట్‌ ప్రతిపాదన ఆగిపోయిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు.

Mallu Bhatti Vikramarka: సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే బనకచర్ల ఆగింది: భట్టి

కొల్లాపూర్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన తరువాత బనకచర్ల ప్రాజెక్ట్‌ ప్రతిపాదన ఆగిపోయిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. త్వరలోనే పోలవరం, బనకచర్ల వెనుక ఉన్న నిజాన్ని బయటపెడతామన్నారు. తెలంగాణ వృథా చేసే నీటితో బనకచర్ల నిర్మిస్తామని ఏపీ మంత్రి లోకేష్‌ చేసిన ప్రకటనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు.


బనకచర్ల, పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణపై కుట్రలు పన్నుతున్నారని భట్టి ఆరోపించారు. తెలంగాణలోని ఎగువ ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోవడం వల్లే దిగువకు నీరు ప్రవహిస్తోందని, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయ్యాకే బనకచర్లపై తదుపరి చర్య ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణకు ద్రోహం చేసిందని కృష్ణా, గోదావరి నదులపై ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిందని చెప్పారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ దోపిడికి పాల్పడిందని భట్టి ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:28 AM