Mahesh Kumar Goud: కిషన్‌రెడ్డీ.. రాష్ట్రానికి ఏం చేశావ్?
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:45 AM
పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. తెలంగాణకు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కనీసం అంబర్‌పేట నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు.

మతం, ఒవైసీ జపం తప్ప అభివృద్ధి ఏది?
మెట్రో విస్తరణ, విభజన హామీలు పట్టవా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ కుమ్మక్కు: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. తెలంగాణకు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కనీసం అంబర్‌పేట నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. గాంధీ భవన్‌లో శుక్రవారం మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీకి మతం తప్ప.. అభివృద్ధి గురించి ధ్యాస లేదని, రజాకార్ల గురించి ఇంకెన్నాళ్లు మాట్లాడతారని ప్రశ్నించారు. పొద్దున లేస్తే ఒవైసీ జపం చేయడం కిషన్‌రెడ్డి అలియాస్ కిస్మత్‌రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. గత జన్మలో వారు అన్నదమ్ములు అయి ఉండొచ్చని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకార్ల రాజ్యం ఎలా వస్తుందో కిషన్‌రెడ్డికే తెలియాలన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి.. ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన సంఖ్యా బలం లేకున్నా.. ఎవరి అండ చూసుకుని బీజేపీ పోటీ చేస్తోందని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సతో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా..? అని నిలదీశారు. సబర్మతీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి.. మూసీ సుందరీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మెట్రో విస్తరణ, విభజన హామీలూ ఆయనకు పట్టవన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ దిగజారుడు భాష మాట్లాడటం సరికాదన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పథకాన్ని అమలు చేసి.. అక్కడి రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టుకోవాలని మహేశ్ సూచించారు.
బీఆర్‌ఎ్‌సకు కడుపు మంట
రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే.. బీఆర్‌ఎస్ నేతలకు కడుపు మండుతోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మొదటి నుంచీ గ్రూప్-1 పరీక్షలపై ఆ పార్టీ నేతలు కేసులు వేస్తూనే ఉన్నారని, నోటిఫికేషన్లను ఆపాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్‌కు ఎందుకంత అక్కసని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడతారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News