Mahesh Kumar Goud: అది విస్కీ బాటిళ్ల మీటింగ్!
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:58 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. అది విస్కీ బాటిళ్ల మీటింగ్. ఆ సభలో జనం కంటే విస్కీ బాటిళ్లే ఎక్కువగా కనిపించాయి. అందుకే ఆ సభకు మహిళలు పెద్దగా రాలేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.

అందుకే మహిళలు ఎక్కువగా రాలేదు
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ధ్వజం
హైదరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. అది విస్కీ బాటిళ్ల మీటింగ్. ఆ సభలో జనం కంటే విస్కీ బాటిళ్లే ఎక్కువగా కనిపించాయి. అందుకే ఆ సభకు మహిళలు పెద్దగా రాలేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు మొదటి.. చివరి విలన్ కేసీఆరేనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ 15 నెలల పాలనపైన చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని పట్టుకుని నకిలీ గాంధీలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘దొంగ పాస్ పోర్టుల బ్రోకరైన కేసీఆర్‌కు గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి లేదు. కాంగ్రెస్ భిక్షతో ఆయన సీఎం అయ్యారు. ఆయన కుటుంబం రూ. లక్షల కోట్లకు పడగలెత్తింది.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య’’ అని మండిపడ్డారు. బీజేపీపై నెమలి పించంతో కొట్టినట్లుగా కేసీఆర్ మాట్లాడారని, ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఇదే నిదర్శనమన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఆడుతున్న మూడు ముక్కలాటతో కేసీఆర్‌కు మతి భ్రమించిందని, కుటంబంలో కొట్లాటతో వేగలేకనే రజతోత్సవ సభ పేరిట హంగామా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందని, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ ను క్షమించరని వ్యాఖ్యానించారు. కాగా, పార్టీలో ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోతారన్న భయంతోనే కేసీఆర్ వరంగల్‌లో మీటింగ్ పెట్టారని, అది డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అని సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర కేసీఆర్ కుటుంబం అడుక్కునే పరిస్థితి ఉండేదన్నారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్