Crime: తీవ్ర విషాదం.. గడ్డిమందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:14 PM
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పదవ తరగతి చదువుతున్న బాలిక కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలుపుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది.
మహబూబాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం, లైంగికంగా కోరిక తీర్చుకోవడం కోసం దారుణంగా హత్యలు చేస్తున్నారు. దొంగతనానికి పాల్పడినప్పుడు ఎవరైనా చూసినా, తమ కోరిక తీర్చలేకపోయినా, తమను వేధిస్తున్నారని ఏకంగా మర్దర్ చేస్తున్నారు. ఇక అనారోగ్యాల కారణంగా, మనస్తాపం చెంది, ప్రేమ విఫలమై, పరీక్షల్లో ఫెయిల్ అవడం, ఆర్థిక కారణాలతో ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. తమ బంగారు భవిషత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది.
మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పదవ తరగతి చదువుతున్న బాలిక కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలుపుకుని తాగింది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి (MGM) తరలించారు. ప్రస్తుతం బాలిక చావుబ్రతుకుల మధ్య చికిత్స పొందుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రాగా.. పాఠశాల వార్డెన్, సిబ్బంది గోప్యంగా ఉంచారు.
ఇవి కూడా చదవండి:
ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు