Tribal Families: సుమోటో వ్యాజ్యంగా ‘ఆంధ్రజ్యోతి ’ కథనం
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:37 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయిదు ఆదివాసీ కుటుంబాలను ఏడాదికాలం కుల బహిష్కరణ చేశారంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది.

స్వీకరించిన లోకాయుక్త
ఆదివాసీ కుటుంబాల కుల బహిష్కరణపై విచారణ
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయిదు ఆదివాసీ కుటుంబాలను ఏడాదికాలం కుల బహిష్కరణ చేశారంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇల్లందు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు నోటీసులు జారీచేసింది.
ఇల్లందు మండలం పాతపూసపల్లికి చెందిన ముడిగె రాములు, సీతమ్మ, సుగుణ, లక్ష్మీనారాయణ సహా ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో లోకాయుక్త స్పందించింది. కల్తీకల్లు తదితర అంశాలపై సైతం లోకాయుక్త సుమోటోగా విచారణ చేపడుతోంది.