Share News

Indian Army: ఆర్మీ దక్షిణ భారత్‌ ఏరియా జేవోసీగా శ్రీహరి

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:04 AM

భారత సైన్యంలోని దక్షిణ భారత్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌(కమాండింగ్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ వీ.శ్రీహరి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.

Indian Army: ఆర్మీ దక్షిణ భారత్‌ ఏరియా జేవోసీగా శ్రీహరి

అల్వాల్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): భారత సైన్యంలోని దక్షిణ భారత్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌(కమాండింగ్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ వీ.శ్రీహరి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్‌ కేంద్రపాలితప్రాంతాలు ఈ దక్షిణ భారత్‌ ఏరియా కిందకు వస్తాయి.


ఈ ప్రాంతాల్లోని సైన్యానికి శ్రీహరి కమాండింగ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా వ్యవహరిస్తారని రక్షణశాఖ తన ప్రకటనలో వెల్లడించింది. శ్రీహరి స్వస్థలం కేరళలోని మలప్పురం. సైన్యంలో ఆయన పలు స్థాయిల్లో సేవలందించారు.

Updated Date - Aug 02 , 2025 | 05:04 AM