Share News

Aghori Arrest: లేడీ అఘోరీ అరెస్టు

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:26 AM

లేడీ అఘోరీ అలియాస్‌ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి శ్రీనివా్‌సను మోకిల పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరిట ఓ మహిళను రూ.9.80 లక్షల మేర మోసం చేసిందనే ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Aghori Arrest: లేడీ అఘోరీ అరెస్టు

శంకర్‌పల్లి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): లేడీ అఘోరీ అలియాస్‌ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి శ్రీనివాస్‌ను మోకిల పోలీసులు అరెస్టు చేశారు. పూజల పేరిట ఓ మహిళను రూ.9.80 లక్షల మేర మోసం చేసిందనే ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. లేడీ అఘోరీ పూజల పేరుతో తన వద్ద రూ.9.80 లక్షలు వసూలు చేసి మోసం చేసిందని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్‌కు చెందిన ఓ మహిళ ఫిబ్రవరి 25న మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లేడీ అఘోరీని ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 04:26 AM