Share News

Fake Liquor Tragedy: కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:36 AM

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మరణించారు. ఆడెపు విజయ్‌(35) నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.

Fake Liquor Tragedy: కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి

  • 13కు పెరిగిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌ సిటీ, కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మరణించారు. ఆడెపు విజయ్‌(35) నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. జూలై6న రాత్రి ఇందిరానగర్‌ కల్లు దుకాణంలో కల్లు సేవించిన ఆడెపు విజయ్‌.. వికారం, వాంతులతో బాధపడుతూ మరుసటి రోజు ప్రతిమ ఆస్పత్రిలో చేరాడు.


విజయ్‌ను జూలై 8న గాంధీ ఆస్పత్రికి అక్కడి నుంచి 9న నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న విజయ్‌.. బుధవారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు. విజయ్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆడెపు విజయ్‌ మరణంతో కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. అయితే, ఇందులో 10 మంది మరణాలనే పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 05:36 AM