Medipally Satyam: కేటీఆర్..! ముందు పార్టీని చక్కదిద్దుకో
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:27 AM
ముందు తన ఇంటిని, పార్టీని చక్కదిద్దుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హితవు చెప్పారు.

లేకుంటే మీ చెల్లి హైజాక్ చేసేలా ఉంది: మేడిపల్లి
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ముందు తన ఇంటిని, పార్టీని చక్కదిద్దుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హితవు చెప్పారు. లేకుంటే పార్టీని ఆయన చెల్లెలు కవిత హైజాక్ చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఊడిపోకుండా చూసుకోవాలని సూచించారు. రైతులు పచ్చగా ఉంటే కేటీఆర్ ఓర్చుకోలేక పోతున్నారని ఆరోపించారు.