Share News

KTR: భారతదేశ పటంలో తెలంగాణకు చోటు లేదా?

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:43 AM

భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు చోటు లేదా? తెలంగాణను తొలగించడంలో మీ ఉద్దేశం ఏంటి? అని బీజేపీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR: భారతదేశ పటంలో తెలంగాణకు చోటు లేదా?

  • ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్ర మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన దేశ పటంలో తెలంగాణ లేదేం?

  • ఇది బీజేపీ విధానమా?.. ప్రధాని స్పందించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు చోటు లేదా? తెలంగాణను తొలగించడంలో మీ ఉద్దేశం ఏంటి? అని బీజేపీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ ఆ రాష్ట్ర మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన భారతదేశ పటంలో తెలంగాణ లేకపోవడంపై గురువారం ఎక్స్‌లో కేటీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేశ్‌కు బహుమతిగా ఇచ్చిన చిత్రపటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే చూపించడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అనుచితమని, ఇది బీజేపీ అధికారిక అభిప్రాయమా? అని కేటీఆర్‌ ప్రధాని మోదీని ప్రశ్నించారు. తెలంగాణను భౌగోళికంగా గుర్తించకపోవడంపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను అగౌరవపర్చడం తగదని పేర్కొన్నారు. పొరపాటైతే, తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసినందుకు గాను బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.


కల్తీకల్లు మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలి

హైదరాబాద్‌లో కల్తీకల్లు తాగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేటీఆర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 05:43 AM