Share News

Kondagattu Temple Rituals: ఘనంగా కొండగట్టు అంజన్న పెద్ద జయంత్యుత్సవాలు

ABN , Publish Date - May 21 , 2025 | 06:59 AM

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్‌ పెద్ద జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన అనంతరం భక్తుల పూజా కార్యక్రమాలు మరియు శోభాయాత్రలు నిర్వహించబడ్డాయి.

Kondagattu Temple Rituals: ఘనంగా కొండగట్టు అంజన్న  పెద్ద జయంత్యుత్సవాలు

  • భద్రాచలం రాములోరి పట్టువస్త్రాల సమర్పణ

మల్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్‌ పెద్ద జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంజన్నకు ప్రభుత్వం తరపున చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, భద్రాచలం సీతారాముల దేవస్థానం తరపున ఆలయ ఈవో రమాదేవి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కళాకారులతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఉత్సవమూర్తులకు పూజలు చేసి యాగశాల ప్రవేశం చేశారు. ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు రెండు లక్షల మంది దీక్షాపరులు తరలిరానున్నారు.

Updated Date - May 21 , 2025 | 07:15 AM