Share News

G Kishan Reddy: పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపునకు సహకరించండి

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:51 AM

తెలంగాణలో పునరుత్పాదక విద్యుదుత్పత్తిని పెంచేందుకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

G Kishan Reddy: పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపునకు సహకరించండి

  • ప్రభుత్వ సంస్థల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తాం..

  • సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పునరుత్పాదక విద్యుదుత్పత్తిని పెంచేందుకు సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తి పెంపునకు తమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి గురువారం లేఖ రాశారు. తమ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ప్రధానంగా కోల్‌ ఇండియా, నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌.. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


ఈ ప్రాజెక్టుల కోసం వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10వేల కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణలోని అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల అభివృద్ధితోపాటు అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ల అభివృద్ధికీ రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూ సేకరణ, భూకేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వ మద్దతు అవసరమన్నారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, సీపీఎ్‌సయూల మధ్య భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరమున్నందున ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎంను కిషన్‌రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు అంగీకరించి సహకారం అందించాల్సిందిగా విన్నవించారు.


ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 03:51 AM