Kishan Reddy: పీఎం కుసుమ్ అమలులో రాష్ట్రప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:55 AM
కేంద్ర ప్రభుత్వం పీఎం-కుసుమ్ పథకం కింద రైతులకు నిరంతరం తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ.. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పీఎం-కుసుమ్ పథకం కింద రైతులకు నిరంతరం తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ.. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులపై భారం పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు.
అందులో భాగంగా రాష్ట్రంలో డి-సెంట్రలైజ్‌డ్ గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదించామని తెలిపారు. దాంతో పాటుగా రాష్ట్రానికి 20 వేల సోలార్ అగ్రికల్చర్ పంప్‌సెట్లను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కేటాయించారని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని తెలంగాణ రైతులకు పీఎం-కుసుమ్ పథకం ప్రయోజనాలను అందేలా చూడాలని కిషన్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News