Share News

Khammam: భట్టికి అవ్వ ఆశీర్వాదం!

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:56 AM

ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేని తనకు ప్రజా ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కావడంతో ఓ వృద్ధురాలు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

Khammam: భట్టికి అవ్వ ఆశీర్వాదం!

  • ఇల్లు మంజూరైందన్న ఆనందంతో నృత్యం

  • వేదికపై జై కాంగ్రెస్‌.. జై భట్టి.. అంటూ నినాదాలు

చింతకాని, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేని తనకు ప్రజా ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కావడంతో ఓ వృద్ధురాలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఖమ్మం జిల్లా చింతకానిలో సోమవారం నిర్వహించిన మహిళాశక్తి సంబురాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి పట్టా అందుకున్న కంచర్ల మరియమ్మ.. అదే వేదికపై ఆనందంతో నృత్యం చేశారు. ‘జై కాంగ్రెస్‌, జై భట్టి’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో భట్టి ఆమెకు నమస్కరిస్తూ దగ్గరకు తీసుకోగా.. నూరేళ్లు చల్లగా ఉండాలంటూ భట్టిని ఆమె ఆశీర్వదించారు. త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్‌ నాయకులు తీసుకుంటారని చెప్పిన భట్టి.. ఆ మేరకు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లుకు పలు సూచనలు చేశారు.

Updated Date - Jul 15 , 2025 | 03:56 AM