Share News

Palair Reservoir: నిండుకుండలా పాలేరు జలాశయం

ABN , Publish Date - Oct 31 , 2025 | 01:42 PM

పాలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది, గురువారం సాయంత్రానికి అధికారుల అంచనా ప్రకారం సుమారు 45వేల క్యూసెక్కులనీరు పరీవాహకప్రాంతాలనుంచి పాలేరు జలాశయానికి వస్తోంది.

Palair Reservoir: నిండుకుండలా పాలేరు జలాశయం

- 48వేల క్యూసెక్కుల వరద రాక

- 26అడుగులకు చేరిన నీటిమట్టం

కూసుమంచి(ఖమ్మం): పాలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది, గురువారం సాయంత్రానికి అధికారుల అంచనా ప్రకారం సుమారు 45వేల క్యూసెక్కులనీరు పరీవాహకప్రాంతాలనుంచి పాలేరు జలాశయానికి వస్తోంది. ముఖ్యంగా వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తుతోంది. దీంతో నిండుకుండను తలపిస్తోంది. జలాశయం ఫాలింగ్‌ గేట్ల ద్వారా బయటకు వదులుతున్నారు.


kmm1.jpg

దీంతో పాలేరు ఏటి వారగా ఉన్న, పరిసర ప్రాంతాల్లోని వరిపొలాలన్నీ నీటమునిగాయి. చేతికందాల్సిన పంట నీటిమునుగుతుందని వాపోయారు. అయితే శుక్రవారం ఉదయం వరకు వరద ప్రవాహం ఇలాగే కొనసాగేఅవకాశం ఉన్నట్లు ఇరిగేషన్‌ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీవాహకప్రాంతం ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పాలేరు జలాశయం చుట్టూఉన్న గ్రామాల్లోని వరిపొలాలు సైతం నీటమునిగాయి.


పర్యాటకుల సందడి

జలాశయం నిండుకుండలా మారడంతో పర్యాటకులు సందడిపెరిగింది. దీంతో సెల్ఫీలు తిగేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో ప్రమాదాలు జరగకుండా కూసుమంచి ఎస్‌ఐ నాగరాజు సిబ్బందిని ఏర్పాటుచేశారు


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2025 | 01:42 PM