Khammam Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:48 AM
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారధిపురం గ్రామ పోడు రైతు ఎట్టి వీరస్వామి (37) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

పెనుబల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారధిపురం గ్రామ పోడు రైతు ఎట్టి వీరస్వామి (37) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్థసారధిపురం గ్రామ వాసి వీరస్వామి 3 ఎకరాల్లో పోడు భూములు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, కొన్నేళ్లుగా దిగుబడి సరిగ్గా రాలేదు.
పంటల సాగు కోసం రూ. లక్షల్లో అప్పులు చేసినందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అప్పు ఇచ్చిన వారు తమ బాకీ తీర్చాలని వేధించడంతో 4 రోజుల క్రితం చౌడారం - భవన్నపాలెం గ్రామాల మధ్య అడవిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.