Share News

BRS Leaders Meet KCR: కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ కీలకనేతల భేటీ

ABN , Publish Date - Aug 01 , 2025 | 03:29 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర నేతలు భేటీ అయ్యారు.

BRS Leaders Meet KCR: కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ కీలకనేతల భేటీ

  • ఫిరాయింపులపై సుప్రీం తీర్పు, కాళేశ్వరం నివేదిక ఇతర అంశాలు, కార్యాచరణపై చర్చ

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు, కాళేశ్వరం కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేసిన నేపథ్యంలో గురువారం ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికలోని అంశాలపై, ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం లేదంటూ కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై దీటుగా స్పందించాలని నేతలకు గులాబీ బాస్‌ సూచించినట్టు తెలిసింది. ఆయా అంశాలపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఆగస్టులో కరీంనగర్‌లో నిర్వహించే బీసీ సభ, బీసీ బిల్లుపై రాష్ట్రపతిని కలిసే అంశాలపైనా పార్టీనేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 03:29 AM