Kavitha: కేసీఆర్, కార్యకర్తల మధ్య వారధిగా ఉంటా
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:14 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తల మధ్య వారధిగా పని చేస్తానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.

సమస్యలను అధినేత దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ కవిత
భద్రాచలం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి ): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తల మధ్య వారధిగా పని చేస్తానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. భద్రాచలంలో సోమవారం తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడేది గులాబీ దండేనని, బీఆర్‌ఎ్‌సతోనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అన్నారు. అలివి కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలను అన్ని రకాలుగా వంచిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.