Sama: కొత్త పార్టీ పెట్టే యోచనలో కవిత: టీపీసీసీ
ABN , Publish Date - May 15 , 2025 | 03:21 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని, ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి అన్నారు.

హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని, ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆమె నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందని చెప్పారు. గాంధీభవన్లో బుధవారం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో బీసీలు, మహిళలకు అన్యాయం జరిగిందని, పదేళ్ల పాలనలో సామాజిక తెలంగాణను నిర్మించలేకపోయామని ఒప్పుకొన్నందుకు కవితకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నామన్నారు. కొత్తగా పార్టీ పెడుతున్న కవిత.. కేసీఆర్ నియంత పోకడలను అనుసరించవద్దని హితవు పలికారు. తనను జైల్లో వేసిన బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలను కవిత జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News