Share News

Kavitha: బీసీ రిజర్వేషన్ల సాధనకు.. జాగృతి 72 గంటల నిరాహార దీక్ష

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:15 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 4 నుంచి 7 వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Kavitha: బీసీ రిజర్వేషన్ల సాధనకు.. జాగృతి 72 గంటల నిరాహార దీక్ష

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 4 నుంచి 7 వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆందోళనలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ చెబితే.. విద్య, ఉద్యోగాల్లోనూ 42 శాతం ఇవ్వాల్సిందేనని జాగృతి డిమాండ్‌ చేసిందని తెలిపారు.


జాగృతి, బీసీ సమాజం ఒత్తిడితోనే ప్రభుత్వం దిగి వచ్చి పంచాయతీరాజ్‌ చట్టం-2018కి సవరణలు చేస్తూ ఇటీవల క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానం చేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపిందని చెప్పారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపి గెజిట్‌ జారీ చేయాల్సి ఉండగా, మళ్లీ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతున్నందున 72 గంటల నిరాహార దీక్ష చేయాలని సంకల్పించామని కవిత తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:15 AM