Jupally Krishna Rao: పర్యాటకం ద్వారా యువతకు ఉపాధి: జూపల్లి
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం మంత్రి కృష్ణానదీ తీరంలోని సోమశిల ప్రాంతంలో పర్యటించారు. పర్యాటకరంగ అభివృద్థికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాస్కి పథకం కింద మంజూరైన రూ.68.10 కోట్లతో సోమశిల, అమరగిరి ద్వీపం, ఈగలపెంట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.