Adilabad: అధికారులు బాధ్యతగా పని చేయాలి: జూపల్లి
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:14 AM
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

ఆర్థిక ఇబ్బందులున్నా.. పక్కాగా పథకాల అమలు: వివేక్
ఆదిలాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గురువారం మంత్రి గడ్డం వివేక్‌తో కలిసి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారుల సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం చేపట్టిన పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చట్టాలను చేస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. హామీ లను, సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తామన్నారు.