Share News

Janampalli Anirudh Reddy: తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:20 AM

తెలంగాణలో చంద్రబాబుకు కోవర్టులు ఉన్నారని, వాళ్లే పెద్ద, పెద్ద కాంట్రాక్టులన్నీ చేపడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు.

Janampalli Anirudh Reddy: తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు

  • పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్లకే: అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, జూలై 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చంద్రబాబుకు కోవర్టులు ఉన్నారని, వాళ్లే పెద్ద, పెద్ద కాంట్రాక్టులన్నీ చేపడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆపాలంటే లేఖలు రాస్తే సరిపోదని, కోవర్ట్‌ కాంట్రాక్టర్లను కట్టడి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన సూచించారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం మోతీఘనపూర్‌లో ముడా నిధులతో నిర్మించే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో దందాలు కూడా చంద్రబాబు కోవర్టులే చేస్తున్నారని, వారికి నల్లా, కరెంటు కనెక్షన్లు కట్‌ చేయాలని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో ఒక్క రూపాయి కూడా రాకుండా చూడాలన్నారు. ఇలా చేస్తే వారంతా చంద్రబాబు వద్దకు వెళ్లి బనకచర్లను బంద్‌ చేయిస్తారని చెప్పారు.

Updated Date - Jul 03 , 2025 | 04:20 AM