ISRO: తెలంగాణ నుంచి ఇస్రోకు ఫినోలిక్ ఫోం ప్యాడ్‌లు
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:04 AM
ఇస్రో త్వరలో ప్రయోగించనున్న జీఎ్‌సఎల్వీ రాకెట్‌లో వినియోగించేందుకు అవసరమైన ‘ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్’లు తెలంగాణ నుంచి వెళ్లనున్నాయి.

యాదాద్రి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఇస్రో త్వరలో ప్రయోగించనున్న జీఎ్‌సఎల్వీ రాకెట్‌లో వినియోగించేందుకు అవసరమైన ‘ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్’లు తెలంగాణ నుంచి వెళ్లనున్నాయి. జీఎ్‌సఎల్వీ రాకెట్‌లో అగ్నిప్రమాదాల నియంత్రణకు, క్రయోజనిక్ సిస్టమ్స్‌లో ఉష్ణాన్ని నియంత్రించేందుకు ఈ ప్యాడ్‌లను వినియోగిస్తారు. అయితే, ఇస్రో త్వరలో చేయబోయే ప్రయోగానికి అవసరమైన ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్‌లను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జెమ్మిలాల్‌పేటలోని వీఎన్‌డీ సెల్‌ప్లాస్ట్ అనే కంపెనీ సిద్ధం చేసింది. ఇస్రోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 365 ప్యాడ్‌లను తయారు చేసి వాటి రవాణాకు సిద్ధమైంది.
వీటిని కేరళ రాజధాని తిరువనంతపురంలోని విక్రంసారాభాయ్ స్పేస్ సెంటర్‌కు బుధవారం తరలించనున్నారు. ఇస్రో అధికారులు బుధవారం వర్చువల్‌గా జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తిరువనంతపురంలో ఇస్రో అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత ఏపీలోని నెల్లూరుకు తరలిస్తారు. కాగా, ఫినోలిక్ ఫోమ్ ప్యాడ్లు, ఫినోలిక్ మిశ్రమాలకు సంబంధించి ఇస్రోతోపాటు రైల్వే, రక్షణ, మైనింగ్, పెట్రో కెమికల్ పరిశ్రమలు తమతో ఒప్పందాలు చేసుకున్నాయని వీఎన్‌డీ సెల్‌ప్లాస్ట్ సంస్థ డైరెక్టర్లు డి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్.సుఖ్‌జీవన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here