Share News

Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:33 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైపూర్‌ వెళ్తున్న ఇండిగో విమానం 6ఈ 815 టేకాఫ్‌ అయిన తర్వాతతిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ అయింది.

Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

శంషాబాద్‌ రూరల్‌, జూలై4 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైపూర్‌ వెళ్తున్న ఇండిగో విమానం 6ఈ 815 టేకాఫ్‌ అయిన తర్వాతతిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌ అయింది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...శుక్రవారం ఉదయం 6.33 గంటలకు 190 మంది ప్రయాణికులతో టేకాఫ్‌ అయిన ఇండిగో విమానంలో 41 నిమిషాల తర్వాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.


ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎట్టకేలకు పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా తిరిగి ఉదయం 7.16 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో దింపడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం విమానం తిరిగి జైపూర్‌ బయలుదేరి వెళ్లింది.

Updated Date - Jul 05 , 2025 | 03:33 AM