Share News

Kargil War: కార్గిల్‌ వీరుడు పద్మపాణి కుటుంబ సభ్యులకు సత్కారం

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:29 AM

కార్గిల్‌ యుద్ధంలో.. శత్రువుల నుంచి కీలకమైన పోస్టులను చేజిక్కించుకునే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసిన 545 మంది వీరసైనికులను స్మరించుకునేందుకు..

Kargil War: కార్గిల్‌ వీరుడు పద్మపాణి కుటుంబ సభ్యులకు సత్కారం
Indian Army

  • జ్ఞాపికతో సత్కరించిన భారత సైన్యం

  • కార్గిల్‌ అమరవీరులకు నివాళులు

  • భావోద్వేగాలను కలిగించేదే..

  • అయినా అది ‘విజయ్‌ దివస్‌’

  • మేజర్‌ పద్మపాణి కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కార్గిల్‌ యుద్ధంలో.. శత్రువుల నుంచి కీలకమైన పోస్టులను చేజిక్కించుకునే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసిన 545 మంది వీరసైనికులను స్మరించుకునేందుకు భారత సైన్యం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్మిల్‌ యుద్ధంలో మరణించిన యోధుల ఇళ్లకు ఆర్మీ చేరుకుంటూ.. కుటుంబ సభ్యులకు ఓ లేఖను, జ్ఞాపికను అందజేసి, సత్కరిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాదిలోని కార్గిల్‌ వీరుల కుటుంబాలను కలిసేందుకు ఓ బృందం హైదరాబాద్‌ చేరుకుంది.


లెఫ్టినెంట్‌ అహ్మద్‌, నాయిబ్‌ సుబేదార్‌ ఎం.వెంకటరెడ్డి తదితరులు, విశ్రాంత సుబేదార్‌ పాండురంగారెడ్డితో కలిసి సోమవారం మేజర్‌ పద్మపాణి ఆచార్య ఇంటిని సందర్శించారు. మేజర్‌ పద్మపాణికి భారత సైన్యంలో రెండో అత్యున్నత పురస్కారమైన మహావీర చక్ర మరణానంతరం అందిన విషయం తెలిసిందే..! ఆర్మీ బృందం సోమవారం జూబ్లీహిల్స్‌లోని పద్మపాణి కుటంబ సభ్యులను-- పద్మపాణి భార్య చారులత, కుమార్తె అపరాజితను కలిసి.. జ్ఞాపికతో సత్కరించింది. ఆర్మీ ప్రత్యేకంగా విడుదల చేసిన కృతజ్ఞత లేఖను అందజేసింది.

Indian-Army.jpg


ఈ సందర్భంగా అపరాజిత ఆచార్య మాట్లాడుతూ.. ఆర్మీ ద్వారా జ్ఞాపికను అందుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామన్నారు. వీరోచితంగా పోరాడిన మన సైనికుల శక్తి సామర్థ్యాలను ప్రతి ఏడాది కార్గిల్‌ విజయ్‌ దివ్‌స(జూలై 26) గుర్తుచేస్తూనే ఉందన్నారు. వ్యక్తిగతంగా తమకు జరిగిన నష్టం కంటే, భారత చరిత్రలో ఓ ప్రతిష్ఠాత్మక విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకొంటామన్నారు.

Indian-Army-2.jpg


సుబేదార్‌ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ కార్గిల్‌ నుంచి ప్రత్యేకంగా తామిక్కడకు వచ్చామన్నారు. మేజర్‌ పద్మపాణి ఆచార్య కార్గిల్‌ యుద్ధంలో అత్యంత కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ నెల 26(విజయ్‌ దివస్‌) నాటికి దేశవ్యాప్తంగా కార్గిల్‌ అమరవీరుల కుటుంబాలను కలుస్తామని చెప్పారు.

Indian-Army-2.jpg


ఇవి కూడా చదవండి

నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 02:13 PM