Youth Behavior: బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:35 AM
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల

నిందితుల్లో నలుగురు 4, 5వ తరగతి
విద్యార్థులు కాగా.. మరొకరు ఇంటర్ విద్యార్థి
జడ్చర్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు... జడ్చర్ల మునిసిపాలిటీలోని ఓ కాలనీలో ఆ బాలిక కుటుంబం నివసిస్తోంది. ఆమెకు సోదరి, సోదరుడు ఉన్నారు. ఆ రోజు తండ్రి ఉదయమే బయటికి వెళ్లాడు. తల్లి అస్వస్థతకు గురైన పెద్ద కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లింది.
అదే సమయంలో నలుగురు బాలురు ఇంటికి వచ్చారు. బాలికపై ఆ నలుగురితో పాటు ఆమె సమీప బంధువు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన తల్లి ముభావంగా ఉన్న చిన్న కుమార్తెను ప్రశ్నించడంతో జరిగిన దారుణాన్ని తెలిపింది. వెంటనే చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు బాలురలో 4వ, 5వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల వయస్సున్న వారు నలుగురు కాగా ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల మరో బాలుడు ఉన్నా డు. వారిపై గ్యాంగ్‌రేప్, పోక్సో కేసు నమోదు చేశారు.