Share News

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

ABN , Publish Date - Nov 28 , 2025 | 07:05 AM

హైదరాబాదీ బిర్యానీకి మరోమారు గుర్తింపు లభించింది. ఇక్కడి బిర్యానీకి 10వ స్థానం దక్కింది. హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి బిర్యానిని ఆరగించేందుకు భోజన ప్రియులు తహతహలాడుతుంటారు.

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

- ప్రపంచంలో అత్యుత్తమ రైస్‌ డిషెస్‏లో ఒకటిగా గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ: ప్రపంచ అత్యుత్తమ రైస్‌ డిష్‌లలో హైదరాబాద్‌ బిర్యానీ(Hyderabadi Biryani) టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. ‘వరల్డ్స్‌ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌ లిస్ట్‌ ఆఫ్‌ 2025’ అంటూ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ జాబితాను విడుదల చేసింది. హైదరాబాదీ బిర్యానీ 10వ స్థానంలో నిలవడమే కాదు.. ఈ జాబితాలో ఎంపికైన టాప్‌ 50 డిషె్‌సలో కూడా ఇండియా నుంచి ఎంపికైన ఒకే ఒక్క డిష్‌ ఇదే కావడం విశేషం. చెఫ్‌లు, ఫుడ్‌ క్రిటిక్స్‌ చేసిన సమీక్షలతో పాటుగా యాత్రికులు అందించిన రేటింగ్స్‌ ద్వారా హైదరాబాదీ బిర్యానీని టాప్‌10 రైస్‌ డిష్‌గా ఎంపిక చేశారు.


city2.2.jpg

ఈ జాబితాలో అధిక శాతం జపనీస్‌ వంటకాలే ఉండటం విశేషం. కాగా, టాప్‌ 10లో మొదటి మూడు డిషెస్‌ నెగిటోరోడాన్‌, సుషీ, కైసెన్డాన్‌లు జపనీస్‌ వంటకాలే కావడం గమనార్హం. ఇండియాలో లక్నో, కశ్మీరీ, కోల్‌కతా.. విభిన్న ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక బిర్యానీలు ఉన్నప్పటికీ హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలిచింది. మరో విశేషమేమిటంటే టాప్‌ 50లో బిర్యానీ పేరిట నిలిచిన మరో వంటకం ఇరాన్‌కు చెందినది కావడం గమనార్హం.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 09:06 AM