Share News

Uttam Kumar Reddy: సీతమ్మసాగర్‌కు కేంద్రం అనుమతిపై మంత్రి రియాక్షన్

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:10 PM

Uttam Kumar Reddy: కృష్ణా జలాల వాటాలో తెలంగాణ రైతులకు బీఆర్‌ఎస్ ద్రోహం చేసిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణకు ఎక్కువ భాగం ఇవ్వాలని ట్రిబ్యునల్‌ ముందు వాదిస్తున్నామన్నారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా వర్కౌట్ చేస్తోందన్నారు.

Uttam Kumar Reddy: సీతమ్మసాగర్‌కు కేంద్రం అనుమతిపై మంత్రి రియాక్షన్
Uttam Kumar Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 26: సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఇచ్చిందని.. ఇది తెలంగాణ ఇరిగేషన్ చరిత్రలో లాండ్ మార్క్ డెవలప్‌మెంట్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శనివారం నాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఏడాదిన్నర కృషి ఫలించిందన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇది ముందడుగని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు చాలా కాలంగా గోదావరి జలాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. గోదావరి నదీ జలాలలో 68 టీఎంసీలు.. 8 లక్షల ఎకరాలకు ఉపయోగమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మేడిగడ్డ కూలిపోయిందని..సీతమ్మ సాగర్ నిలబడుతుందా అని కేంద్రం అడిగిందన్నారు. సీడబ్ల్యూసీకి అన్ని వివరాలు పంపితే అప్పుడు అప్రూవల్ ఇచ్చారని వెల్లడించారు.


పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ముంపు నష్టం.. ప్రొటెక్షన్ వాల్ కోసం కేంద్రం నిధులు ఇవ్వాలని అడిగామని.. అందుకు కేంద్రం కొంత అనుకూలంగా ఉందని తెలిపారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణ రైతులకు బీఆర్‌ఎస్ ద్రోహం చేసిందని విమర్శించారు. తెలంగాణకు ఎక్కువ భాగం ఇవ్వాలని ట్రిబ్యునల్‌ ముందు వాదిస్తున్నామన్నారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా వర్కౌట్ చేస్తోందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై బీఆర్‌ఎస్ మాట్లాడే తీరు ఖండిస్తున్నామన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర తాము ప్రాజెక్ట్ మొదలుపెట్టామని.. బీఆర్‌ఎస్ తమకు పేరు వస్తుందని రీడిజైన్ చేసి... లక్షన్నర కోట్లకు పెంచారని అన్నారు. కాళేశ్వరం కట్టిన డబ్బు బీఆర్‌ఎస్ వాళ్ళ జేబులో నుంచి కట్టలేదన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ తాకట్టు పెట్టి మరీ కట్టారని మండిపడ్డారు. వాళ్ళే కట్టారు.. వాళ్ల హయంలోనే కూలిందని అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ చూస్తే ఎంత దుర్మారం చేశారో అర్థం అవుతోందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌లో విషయాలు తెలంగాణ ప్రజలు గుర్తించాలని అన్నారు.

Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి


ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి షిఫ్ట్ చేసి అన్యాయం చేశారని..ద్రోహం చేశారని మండిపడ్డారు. మేడిగడ్డనే కాదు.. సుందిళ్ళ, అన్నారం కూడా ప్రమాదంలో ఉందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని తెలిపారు. లక్ష కోట్లు దోపిడి చేసిన వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలో ఆలోచించాలన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై సమీక్ష చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ లాగా చిల్లర ఆలోచనలు తమకు ఉండవన్నారు. ‘మీ సభ ఎప్పుడూ ఉందో ఎన్‌డీఎస్‌ఏకు ఏం తెలుసు. అబద్ధపు మాటలు ఆపండి. ఎన్‌డీఎస్‌ఏ సూచనలే మేము నమ్ముతాం’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

BRS Vs Congress: మీ మౌనం దేనికి సంకేతం.. రాహుల్‌కు కవిత సూటి ప్రశ్న

Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 26 , 2025 | 03:10 PM