Share News

RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

ABN , Publish Date - Jan 27 , 2025 | 11:03 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావొస్తోందని ఇంతవరకు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చి ప్రైవేటుకు పూర్తిగా దారాదత్తం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె చేయాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..
Telangana RTC Strike

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC)లో సమ్మె సైరన్ మోగనుంది (Strike Notice). నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆర్టీసీ కార్మికులు (RTC employee) సమ్మెబాట పట్టనున్నారు. సోమవారం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (RTC Managing Director) (ఎండీ)కు కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (Sajjinar)కు కార్మిక సంఘాలు బస్ భవన్‌లో నోటీసు ఇవ్వనున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరంచాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2021 నుంచి వేతన సవరణ, దాంతోపాటు ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం తదితర డిమాండ్లతో సజ్జనార్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

ఈ వార్త కూడా చదవండి

హుస్సేన్‌సాగర్‌ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్


సాయంత్రంయాజమాన్యానికి సమ్మె నోటీసు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావొస్తోంది. ఇంతవరకు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చి ప్రైవేటుకు పూర్తిగా దారాదత్తం చేస్తున్నారని.. ఈ అంశం కూడా కార్మికులు సమ్మె నోటీసులు పేర్కొననున్నారు. ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్ రావడంవల్ల దాదాపు ఐదుగురు చొప్పున ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి ఆర్టీసీ వెళ్లిపోతుందంటూ కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని, అలాగే ఆర్టీసీని పూర్తిగా పరిరక్షించాలనే డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు ఎండీ సజ్జనార్‌‌కు ఈరోజు సాయంతరం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.


ప్రధానంగా ఆర్టీసీలో కార్మికుల హక్కులు హరిస్తున్నారని జేఏసీ ఆరోపించింది. ఈ తరుణంలో.. హక్కుల సాధనకై, రావాల్సిన ఆర్ధిక, ఇతర అంశాల కోసం సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. మన హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో పాల్గొనకపోతే.. బానిసత్వానికి మనమే కారణం అవుతామన్నారు. ఆర్టీసీ కార్మికుల సత్తా ఏంటో మళ్లీ చూపిద్దామని జేఏసీ.. ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చింది. సర్వీసుల్లో ఉన్నవారి సమస్యలే కాదు.. రిటైర్డ్ అయిన వారి సమస్యలు ఇంకా తీరనే లేదని, పెండింగ్‌లో బకాయిలు, అడుగు పడని పేస్కేళ్లు, చెల్లించని సీసీఎస్ బకాయిలు, డీఏ బకాయిలు, యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి

కస్టోడియల్ టార్చర్ కేసు.. పోలీసుల కస్టడీకి తులసిబాబు..

రైతుల అకౌంట్స్‌లో రైతు భరోసా నిధులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 27 , 2025 | 11:27 AM