Telangana District Congress Committees: తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీళ్లే..
ABN , Publish Date - Nov 22 , 2025 | 08:31 PM
తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు, అలాగే మరో మూడు కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది.
ఢిల్లీ, నవంబర్ 22: తెలంగాణ డీసీసీ(District Congress Committees) లకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 33 జిల్లాలకు, మూడు కార్పొరేషన్లకు(కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్)లకు డీసీసీ అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఆమోదం మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.
నూతన డీసీసీలు వీరే..
ఆదిలాబాద్ - డాక్టర్ నరేష్ జాదవ్
ఆసిఫాబాద్ - ఆత్రం సుగుణ
భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న
భువనగిరి - బీర్ల ఐలయ్య
గద్వాల - రాజీవ్ రెడ్డి
హన్మకొండ - ఇనిగాల వెంకట్రామి రెడ్డి
హైదరాబాద్ - సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల
జగిత్యాల - నందయ్య
జనగాం - ధన్వంతి
జయశంకర్ - భూపాలపల్లి కరుణాకర్
కామారెడ్డి - మల్లికార్జున ఆలె
కరీంనగర్ - మేడిపల్లి సత్యం
కరీంనగర్ కార్పొరేషన్ - అంజన్ కుమార్
ఖైరతాబాద్ - మోహిత్
ఖమ్మం - నూతి సత్యనారాయణ
ఖమ్మం కార్పొరేషన్ - దీపక్ చౌదరి
మహబూబాబాద్ - భూక్య ఉమ
మహబూబ్ నగర్ - సంజీవ్ ముదిరాజ్
మంచిర్యాల - రఘునాథ్ రెడ్డి
మెదక్ - అంజనేయులు గౌడ్
మేడ్చల్ - వజ్రేష్ యాదవ్
ములుగు - పైడకుల అశోక్
నల్గొండ- పున్న కైలాష్ నేత
నారాయణపేట - ప్రశాంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ - చిక్కుడు వంశీ కృష్ణ
నిర్మల్ - బొజ్జు
నిజామాబాద్ - నాగేష్ రెడ్డి
నిజామాబాద్ కార్పొరేషన్ - బొబ్బిలి రామకృష్ణ
పెద్దపల్లి - రాజ్ ఠాకూర్
రాజన్న సిరిసిల్లా - సంగీతం శ్రీనివాస్
సికింద్రాబాద్ - దీపక్ జాన్
సిద్దిపేట - తుంకుంట ఆకాంక్ష రెడ్డి
సూర్యాపేట - గుడిపాటి నర్సయ్య
వికారాబాద్ - దారా సింగ్ జాదవ్
వనపర్తి - శివసేన రెడ్డి
వరంగల్ - అయూబ్



ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి