Share News

Plan Crash: విమాన ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:32 PM

విమానంలో ఒక ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్ రన్ అవుతుంది అంటున్నారు.. ఆది తప్పు. రెండు ఇంజన్లు ఒకేసారి రన్ అవుతుంటాయి. పక్షులు అడ్డు రావడం అనేది కూడా కారణమే కాదు.. ఇది ప్రతీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండే సమస్యనే..

Plan Crash: విమాన ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్
Telangana Aviation Director on Plan Crash

ఇంటర్నెట్ డెస్క్: దశాబ్దకాలంలో అతిపెద్ద విమాన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఆంధ్రజ్యోతితో కీలక, ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద విచారణలో చాలా అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఒక ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్ రన్ అవుతుంది అంటున్నారు.. ఆది తప్పు. అని భరత్ రెడ్డి తేల్చి చెప్పారు. రెండు ఇంజన్లు ఒకేసారి రన్ అవుతుంటాయని.. రెండు ఇంజన్లు అన్ని రకాలుగా చెక్ చేసిన తర్వాతే.. రన్ వే మీదకు అనుమతి ఇస్తారన్నారు. ఆ తర్వాతే విమానాలు టేకాఫ్ అవుతాయని స్పష్టం చేశారు. ఫ్యూయల్ బ్లాక్ అనేది కారణమే కాదన్న భరత్ రెడ్డి.. ఒకవేళ అలాంటి బ్లాక్ వచ్చినా ఇంజన్‌లో ఉన్న ఫ్యూయల్‌తో ఫ్లైట్ తిరిగి ఎయిర్ పోర్టుకు వచ్చి సేఫ్ ల్యాండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పక్షులు అడ్డు రావడం అనేది కూడా కారణమే కాదని.. ఇది ప్రతీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండే సమస్యనే అని కొట్టి పారేశారు.

plan-crash-1.jpg


'ఒకేసారి రెండు ఇంజన్లలోకి పక్షులు రావడం.. రెండు ఇంజన్లు ఒకేసారి ఆగిపోవడం అనేది హైలీ ఇంపాజిబుల్. మే డే అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ప్రమాదాలు నివారించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ.. నిన్న జరిగిన ప్రమాదం కేవలం 40 సెకండ్లలో జరిగింది. పైలట్ కూడా కంట్రోల్ కోల్పోయాడు. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా.. ఫ్లైట్ ఫ్లై అయ్యేలా టెక్నాలజీ పని చేస్తుంది. కానీ.. నిన్న ప్రమాద సమయంలో అది జరగలేదు. గురుత్వాకర్షణ శక్తి వల్లే ఫ్లైట్ కుప్పకూలింది. ఫ్లైట్ వింగ్‌కి ఉన్న ప్రతీ బ్లేడ్ కూడా చాలా కీలకం. ఒక్క బ్లేడ్ యాక్షన్ సరిగ్గా లేకపోయినా.. రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళినా.. ప్రమాదం జరుగుతుంది'. అని భరత్ రెడ్డి చెప్పారు.

plan-crash-3.jpgఇంకా ఏవియేషన్ డైరెక్టర్ ఏమన్నారంటే.. 'ఇండియాలో ఎయిర్ క్రాష్ అనేది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. బ్లాక్ బాక్స్‌ను డీకోడ్ చేసి , డిజిటల్ వీడియో రికార్డర్ ఓపెన్ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. ATCకి సమాచారం ఇచ్చేంత టైం కూడా నిన్న పైలట్‌కి లేదనేది అర్థం అవుతుంది. ATC కేవలం పైలట్‌ను గైడ్ చేస్తుంది తప్ప , కంట్రోల్‌లోకి తీసుకోలేదు'. అని భరత్ రెడ్డి తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణీకుడి గురించి కూడా భరత్ రెడ్డి మాట్లాడారు.

plan-crash-4.jpgప్రమాదంలో ప్రయాణికుడు తనకు తాను ఎమర్జెన్సీ నుండి బయటపడే అవకాశం లేదని, క్రాష్ అయ్యే సమయంలో ఓపెన్ అవ్వడం వలన ఆ తాకిడికి ఎగిరి భయపడ్డాడని.. తనకు తాను బయట పడాలంటే సమయం కావాలని డైరెక్టర్ తెలిపారు. అలాగే పైలట్ అలర్ట్ ఇచ్చి డోర్స్ ఓపెన్ చేస్తే తప్ప ప్రయాణీకులు బయట పడలేరని భరత్ రెడ్డి స్పష్టం చేశారు.

plan-crash-2.jpg


ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అమెరికా షాకింగ్ నిర్ణయం..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 06:15 PM