Kalpana Health Update: సింగర్ కల్పన హెల్త్ బులెటిన్ విడుదల..
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:30 PM
సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె చికిత్స పొందుతున్న కూకట్‌పల్లి హోలిస్టిక్ ఆస్పత్రి డాక్టర్ చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కల్పన నిద్రమాత్రలు మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చికిత్స అందిస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చైతన్య తెలిపారు.

హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని కల్పన (Singer Kalpana) ఆరోగ్యం (Health) నిలకడగా ఉందని కూకట్‌పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేశారు. గాయని కల్పన నిద్రమాత్రలు (Sleeping Pills) మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్ (Ventilator)పై చికిత్స అందిస్తున్నామన్నారు. ఆమెకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని, ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ చైతన్య (Dr. Chaitanya) తెలిపారు.
Read More..:
జగన్ చేసే ద్రోహాన్ని.. ప్రజలకు వివరించాలి..
మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ఆపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను హాస్పిటల్‌కు తీసుకు వచ్చారని డాక్టర్ చైతన్య తెలిపారు. నిద్ర మాత్రలు ఎక్కువ తీసుకున్నారని చెప్పారు.. మాత్రల డోస్ ఎక్కువ అవ్వడంతో.. స్టమక్ వాష్ చేసామని.. బ్రీతింగ్ సమస్యలకు పరీక్షలు చేసి.. పలమనరి సమస్యకు చికిత్స అందించామని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో 12 గంటలు వెంటిలేటర్ పెట్టామని.. ప్రస్తుతం వెంటి లేటర్ తీసేసామన్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని.. ఆ సమస్యను క్లియర్ చేస్తామన్నారు. ప్రస్తుతం కల్పన ఆక్సిజన్‌పై ఉన్నారని.. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చైతన్య తెలిపారు.
మరోవైపు సింగర్ కల్పన కేసులో కేపీహెచ్‌బీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ‘Zolfresh’ ఆమె నిద్ర మాత్రలు వేసుకున్నారు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కాగా బుధవారం కల్పన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. హైదరాబాదులో సింగింగ్‌తో పాటు లా కూడా చేస్తున్నారు. తన పెద్ద కూతురును హైదరాబాదుకు రావాలని కల్పన కోరారని అయితే తాను హైదరాబాదుకురానని కేరళలోని ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగినట్లు తెలియవచ్చింది. కాగా సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి కల్పన పాల్పడ్డారు. రోజూ వేసుకునే నిద్ర మాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేశారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి కాల్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కల్పనను హాస్పటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గతంలో ఈ విషయాన్ని జగనే స్వయంగా చెప్పారు: స్పీకర్
సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News