Share News

Pranay case : ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:12 PM

Pranay case : తెలంగాణ వ్యాప్తంగా పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసు సంచలనం సృష్టించింది. ఇవాళ నల్గొండ జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Pranay case : ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు
Pranay case

నల్గొండ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పును ఇవాళ(సోమవారం) నల్లగొండ కోర్టు వెల్లడించింది. ఏ 2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం కీలక తీర్పు వెలువరించింది. 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని ఈ సందర్భంగా నేరస్తులు వేడుకున్నారు. హార్ట్ పెషేంట్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్న పిల్లలు ఉన్నారని కొందరు నేరస్తులు న్యాయ స్థానానికి తెలిపారు.


ఉగ్రవాది అస్గర్‌ అలీకి సుపారీ..

అయితే ఏ2 సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రణయ్‌ హత్యలో సుభాష్ శర్మ కీలకపాత్ర పోషించాడు. సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే జైల్లో ముగ్గురు నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు. ఉగ్రవాది అస్గర్‌ అలీకి సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను అమృత తండ్రి హత్య చేయించాడు. ఏడుగురితో ఓ గ్యాంగ్‌ను అస్గర్‌ అలీ ఏర్పాటు చేశాడు. గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరెన్‌ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిపి అస్గర్‌ అలీ గ్యాంగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


అన్ని కోణాల్లో విచారణ..

కాగా.. పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018 సెప్టెంబర్ 14వ తేదీన హత్యకు ప్రణయ్ గురయ్యాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా.. దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్యకేసుల్లో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్థారించి, 2019 జూన్‌ 12 వ తేదీన చార్జిషీట్‌ దాఖలు చేయగా నల్లగొండ ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌ కోర్టు విచారణ మొదలుపెట్టింది.


తుది తీర్పు రిజర్వు

సుమారు 5సంవత్సరాల 9నెలల కాలం పాటు విచారణ కొనసాగగా, పోలీస్‌ శాఖ సమర్పించిన చార్జిషీట్‌ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈరోజు రిజర్వు చేసింది. ప్రణయ్‌ హత్యకేసులో ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ2 బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మ, ఏ3 అజ్గర్‌అలీ, ఏ4 అబ్ధుల్‌బారీ, ఏ5 ఎం.ఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్‌, ఏ7 శివ, ఏ8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు(ఏ-1) 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించింది. సుభాష్‌శర్మ (ఏ-2), అస్గర్‌అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నా విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

Group 1 Results: కాపేపట్లో గ్రూప్‌-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

Congress: అభ్యర్థిత్వం అనూహ్యం

Harish Rao: రేవంత్‌రెడ్డీ.. పైశాచికానందం నీదే!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 12:54 PM