Share News

Saluting Our Heroes: 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో ఆగష్టు 3న అద్భుత ప్రోగ్రామ్

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:01 PM

ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో గొప్ప విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులైన..

Saluting Our Heroes: 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో ఆగష్టు 3న అద్భుత ప్రోగ్రామ్
Voice of Hyderabad Academicians

హైదరాబాద్, ఆగష్టు 1: 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అని చాటిన గురజాడ బాటకి నిదర్శనంగా.. భారతదేశ గడ్డపై ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని తట్టి లేపి, ఏకతాటిపైకి తీసుకొచ్చిన సందర్భం పహల్గాం ఉదంతం. దేశ నుదుటి తిలకంపై మత మౌడ్యులైన ముష్కర్లు, భారత మాత ముద్దుబిడ్డల ప్రాణాలను హరించి వేశారు. మన మాతృమూర్తుల నుదుట సింధూరాన్ని చెరిపేశారు. అయినా అదరని, బెదరని భరత వనితల ధైర్యం, ముష్కర్లకు బుద్ధి చెప్పిన మన జవానుల సాహసం మాటల్లో చెప్పలేనిది.

భారతదేశ గడ్డపై జరిపిన పహల్గాం మారణ హోమానికి దీటుగా చెప్పిన సమాధానమే ఆపరేషన్ సిందూర్. ప్రహల్గాం ఉగ్రదాడికి.. భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 2025 మే 7న తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసింది. అయితే పాక్ దాడుల్లో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి జోహార్లు తెలిపేందుకు ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. ఈ భావోద్వేగ ఘటన వల్ల భారతీయులపై పడిన ప్రభావం గురించి ఈ సభలో చర్చిస్తారు. ఎ.బి.ఆర్.ఎస్.ఎం(ABRSM) అఖిల భారతీయ శైక్షిక మహాసంఘ్ తరఫున 'వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈనెల 3(ఆదివారం)న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తారు. కాగా, ఎ.బి.ఆర్.ఎస్.ఎం అనేది ఒక టీచర్స్ యూనియన్. అయినప్పటికీ ఈ సంస్థ దేశభక్తి.. జాతీయ భావజాలంతో ముందుకెళుతోంది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులైన అతిథులెందరో హాజరవుతున్నారు.


వీరిలో ఎం.వెంకయ్య నాయుడు (మాజీ ఉపరాష్ట్రపతి), డాక్టర్ జి.సతీష్ రెడ్డి(ఫార్మా చైర్మన్ DRDO), డాక్టర్ సుబ్బారావు పావులూరి (సీఎండీ అనంత్ టెక్నాలజీస్), గుంతా లక్ష్మణ్ జి(నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఎ.బి.ఆర్.ఎస్.ఎం), డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి (డైరెక్టర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్), డాక్టర్ జి.రామేశ్వరరావు డైరెక్టర్ (ఎస్‌సీఐ) తదితరులు ఉన్నారు.

ఇంకా, దేశానికి అనన్యమైన సేవలనందిస్తున్న యు.రాజబాబు(D.G. మిస్సైల్స్ అండ్ స్టాటజిక్స్ సిస్టమ్స్), లెఫ్ట్నెంట్ జనరల్ కరణ్ బీర్ సింగ్, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, జి.చంద్రమౌళి, డాక్టర్ జగన్నాథ్ నాయక్, ప్రతిక జి.సెల్వ, అజిత్ బి.చౌదరి సహా పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

దేశ నిర్మాణంలో అధ్యాపకుల పాత్ర ఎనలేనిది. అధ్యాపకులంతా కలిసి ఈ దేశాన్ని కాపాడుతున్న జవానులందరికీ నివాళులు అర్పించేందుకు, వారిని గౌరవించేందుకు పౌర సమాజంతో కలిపి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఏబీఆర్ఎస్ఎన్ తెలంగాణ కమిటీ కోరుతోంది.

ABRSM.jpegఈ కార్యక్రమంలో మిస్సైల్స్ మోడల్స్ తో ఎగ్జిబిషన్ స్టాల్స్ విజ్ఞానాన్ని అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. అందరూ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నారు.

Celebrating-success.jpg


ఇవి కూడా చదవండి..

20 మంది దాటితే రెండో టీచర్‌

రాజమండ్రి జైలుపై డ్రోన్‌.. టెన్త్‌ విద్యార్థిపై కేసు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 06:42 PM