Share News

Lift Murder: హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:32 PM

Lift Murder: భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కొందరు దుండుగులు అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Lift Murder: హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య
Hyderabad lift murder

హైదరాబాద్, ఏప్రిల్ 28: నగరంలోని హిమాయత్‌నగర్‌లో (Hymayathnagar) ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్‌లో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే దోమలగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం, పోలీసులు ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు.సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి (Central Zone DCP Shilpavalli) ఆధ్వర్యంలో హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈరోజు ఉదయం బ్యాంకు వచ్చిన సిబ్బంది లిఫ్ట్‌లో మృతదేహాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


లిఫ్ట్‌లో మృతదేహాన్ని చూసిన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని లిఫ్ట్‌లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలకమైన ఆధారాలను ఇప్పటికే క్లూస్‌ టీం సేకరించింది. అయితే పక్కా పథకం ప్రకారమే దుండగులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం


మృతుడిని ఎక్కడ హత్య చేశారు.. ఎలా మృతదేహాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్య జరిగిన తీరును చూస్తే పూర్తిగా పాతకక్షలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ఖాకీలు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి ఎవరు.. అతడి వివరాలు ఏంటి అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే లిఫ్ట్‌‌లో వ్యక్తి దారుణ హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది.


ఇవి కూడా చదవండి

Revanth - Jana Reddy Meeting: జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీ.. కారణమిదే

Bhoodan Land iInvestigation: భూదాన్ ల్యాండ్ ఇష్యూ.. కీలక వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 03:40 PM