Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:13 AM
Pakistani Citizens: వీసా గడువు ఈరోజుతో ముగియనుండటంతో పాకిస్థానీలు భారత్‌ను వీడుతున్నారు. నలుగురు పాకిస్థాన్ వాసులు హైదరాబాద్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోయారు.

హైదరాబాద్, ఏప్రిల్ 29: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ వాసుల (Pakistani nationals leave India) వీసాలు రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఈరోజే చివరి రోజు. దీంతో పాకిస్థానీలు దేశం విడిచి హుటాహుటిన తమ దేశానికి పయనమవుతున్నారు. అలాగే హైదరాబాద్‌లో (Hyderabad) ఉన్న పాకిస్థాన్ వాసులను గుర్తించిన పోలీసులు.. వారు వెంటనే నగరం విడిచి పెట్టిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాకిస్థానీలు హైదరాబాద్‌ను వీడుతున్నారు. తాజాగా నలుగురు పాకిస్థానీలు హైదరాబాద్‌ను వీడి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ నలుగురిలో ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు, మరో బాలుడు ఉన్నారు.
వీరంతా కూడా శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ మీదగా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. నలుగురు పాకిస్తానీలు ఆదివారమే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణలో మరికొంత పాకిస్తానీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు వెరిఫై చేస్తున్నారు. నేటితో పాకిస్థానీలకు గడువు ముగింపు ఉండటంతో నిన్నటి వరకు నలుగురు పాకిస్థానీలు వెళ్ళిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.
Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
కాగా.. కేంద్రం ఆదేశాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్‌లో మొత్తం 213 మంది పాకిస్థానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసాపై ఉన్నారని, మిగిలిన వారందరికీ లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో షార్ట్ టర్మ్ వీసా ఉన్న నలుగురు పాకిస్థానీలను దేశం విడిచి వెళ్లాల్సిందిగా హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గడువులోపు దేశం విడిచి వెళ్లని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరికాలు జారీ చేశారు. ఈ క్రమంలో నలుగురు పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోయారు.
అయితే పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు ఈరోజు (ఏప్రిల్ 29) వరకు కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. మెడికల్ పరంగా వచ్చిన వారికి కూడా ఈరోజు వరకు గడువు విధించారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అలర్ట్ అయి.. పాకిస్థానీలను గుర్తించి వారిని దేశం విడిచి వెళ్లాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. దీంతో నేటితో గడువు ముగియనుండటంతో ఇప్పటికే అనేక మంది పాకిస్థానీలు తమ దేశానికి తిరుగుముఖం పట్టారు.
ఇవి కూడా చదవండి
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Read Latest Telangana News And Telugu News