Yoga: ఓజాస్ తేజో ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:05 PM
Ojas Tejo.. యోగా విశిష్టతను, తమ దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను యోగా గురువు వర్ష దేశ్‌పాండే వివరించారు. యోగా శారీరక, మానసిక, ఆరోగ్యంపై చూపే సానుకూల ప్రభావాన్ని ఆమె చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి రోజులో కొంత సమయం కేటాయించాలని ఆమె అన్నారు.

Hyderabad: ‘ఓజాస్ తేజో యోగా’ (Ojas Tejo Yoga) ఇన్‌స్టిట్యూట్ (Institute) ఆధ్వర్యంలో హైదరాబాద్ (Hyderabad) డిడి కాలనీ లైబ్రరీ హాల్‌లో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (11th International Yoga Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో కాలనీ వాసులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వివిధ యెగాసనాలను ప్రదర్శించారు. డీడీ కాలనీ లైబ్రరీ హాల్ మొత్తం యోగా సాధకులతో నిండిపోయింది.
ఈ సందర్భంగా ‘ఓజాస్ తేజో యోగా’ ఇనిస్టిట్యూట్ నిర్వహకురాలు, యోగా గురువు వర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ.. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యోగా విశిష్టతను, తమ దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక, మానసిక, ఆరోగ్యంపై చూపే సానుకూల ప్రభావాన్ని నొక్కి చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి రోజులో కొంత సమయం కేటాయించాలని తెలిపారు. ప్రస్తుత నగరజీవనంలో మహిళలందరికీ రోజువారీ యోగా సాధన ఆవశ్యకతను వివరించారు. అనంతరం పలు యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తి నింపారు.
అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ.. రోజువారీ యోగా చేయడంలో వారి అనుభవాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యోగా విద్యార్థులతో పాటు పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓజాస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు వర్ష దేశ్‌పాండేకు శాలువా కప్పి సత్కరించారు.
ఇవి కూడా చదవండి:
డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..
విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలు..
For More AP News and Telugu News